టాలీవుడ్ మాస్ రాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కాని గట్టి హిట్ మాత్రం పడటం లేదు. గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ తో పలకరించినప్పటికి ఆశించినంతగా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే సంకల్పంతో భాను బోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమాతో వస్తున్నాడు. బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యా ఈ మూవిని నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం ఆధారంగా రూపొందిన కథతో ఈ సినిమా రాబోతుంది.
ఇక ఈ మూవీ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. తాజాగా మాస్ మహారాజ్ ఫుల్ ఎనర్జిటిక్ పోలీస్ గెటప్ లో ఉన్న పోస్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ తో రేపు జనవరి 26 రవితేజ బర్త్ డే కానుకగా ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.. మాస్ ట్రీట్ కోసం అంతా రెడీ అవ్వాలని చెప్పారు. దీంతో పాటుగా రవితేజ భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ కనిపిస్తున్నటుగా కూడా ఓ పోస్టర్ రివిల్ చేశారు. అభిమానులు, ఫాలోవర్లకు కావాల్సిన పసందైన విందు భోజనంలా మాస్ జాతర ఉండబోతున్నట్టు ఈ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇతర నటినటుల గురించి తెలియాల్సి ఉంది. ఇక ఈ గ్లింప్స్ కోసం మాస్ రాజా అభిమానులు ఈగర్ గా వెట్ చేస్తున్నారు.
MARK YOUR CLOCKS!!🔥🥁🤙🏻#MASSJathara ~ MASS RAMPAGE GLIMPSE will be out TOMORROW at 11:07 AM! 💥💥
Let’s Celebrate 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl’s SWAG and EXPLOSIVE energy in style!! 😎🔥@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/WxtbngLARY
— Sithara Entertainments (@SitharaEnts) January 25, 2025