Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఓ మై లిల్లీ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. డీజే టిల్లు లో రొమాంటిక్ సాంగ్ లానే ఇది కూడా కనిపిస్తుంది.
టిల్లు గాడు రాధిక చేసిన మోసాన్ని తట్టుకోలేక తిరుగుతున్న సమయంలో లిల్లీ కనిపించడం.. ఆమెతో వెంటనే ప్రేమలో పడడం, రొమాన్స్ చేయడం మొదలుపెడతాడు. ఇక ఆ సమయంలో టిల్లు.. తనకు తాను ప్రశ్నించుకొనే సాంగ్ లా అనిపిస్తుంది. అంతకు ముందు ఒక స్టోరీ ఉంది.. ఆ స్టోరీలా మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతుంది. లిల్లీ వదిలేసి వెళ్ళకు .. మళ్లీ గాయం చేయకు అని టిల్లు పాడుతున్న సాంగ్ ఇది. ఇక వీడియోలో లిల్లీ చుట్టూ టిల్లు ఎలా తిరిగాడు అనేది చూపించారు. రామ్ మిరియాల సంగీతం అందించిన ఈ సాంగ్ కు సిద్దు లిరిక్స్ అందివ్వడం విశేషం. ఇక శ్రీరామ్ చంద్ర తన హస్కీ వాయిస్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మార్చి 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో టిల్లు మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.