NTV Telugu Site icon

Tillu Square OTT : టిల్లు గాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్ ?

Tillu22

Tillu22

తెలుగు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 125 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ ను అందుకుంది.. ఇప్పుడు ఇక ఓటీటిలోకి రాబోతుంది..

సిద్దు డైలాగులు, కామెడీ టైమింగ్‌, హీరోయిన్ తో అతడి కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగులో సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది.. ప్రతి సీన్ జనాలను నవ్వించే ప్రయత్నం చేశాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోందని టీమ్ ప్రకటించింది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. సరికొత్త కథతో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇదిలా ఉండగా.. సినిమా ఓటీటీలోకి రావడానికి డేట్ ను ఫిక్స్ చేసుకుంది.. అనుకున్న టైం కు వచ్చేస్తుంది. ఈ నెల 26 న సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుంది.. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అఫిషియల్ ప్రకటన వచ్చేసింది.. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Show comments