Site icon NTV Telugu

యు.కె.లో మొదలైన టైగర్ ష్రాఫ్ ‘గణపత్’ షూటింగ్!

బాలీవుడ్ తాజా కండల వీరుడు టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ మూవీ ‘గణపత్’ షూటింగ్ శనివారం యు.కె.లో మొదలైంది. ఈ విషయాన్ని హీరో టైగర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీక్వెల్ చిత్రాల హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఇది రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని ప్రకటించాడు. వికాశ్ బహల్ దర్శకత్వంలో పూజా ఎంటర్ టైన్ మెంట్‌ బ్యానర్ పై ‘గణపత్ -1’ చిత్రాన్ని వషు భగ్నానీ నిర్మించబోతున్నాడు. వినాయకుడి భక్తుడైన బాక్సింగ్ యోధుడు గణపత్ కథ ఇదని దర్శకుడు చెబుతున్నాడు. 2014లో ‘హీరో పంతి’ మూవీతో టైగర్ ష్రాఫ్ తోనే పాటే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతీ సనన్ రెండో సారి ఈ మూవీలో టైగర్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే యేడాది డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.

Exit mobile version