Site icon NTV Telugu

Bharateeyudu 2: తెలంగాణాలో భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు ఎంతంటే?

Bharateeyudu 2

Bharateeyudu 2

Ticket Rates hike for Bharateeyudu 2 in Telangana: సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలబడింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించగా కస్తూరి వంటి వాళ్ళు ఇతర పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాకి సుమారు 28 ఏళ్ల తర్వాత భారతీయుడు 2 అనే పేరుతో ఒక సీక్వెల్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, ఎస్ జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Raj Tarun: 10 ఏళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్లు.. మారు పేరుతో విదేశీ ట్రిప్పులు.. రాజ్ తరుణ్ కేసులో సంచలనాలు

ఇక తాజాగా ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అమ్ముకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ లో 75 రూపాయలతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే అమ్ముకునే అవకాశం కల్పించారు. ఈ మధ్యనే రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవాలంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలని ఈ మేరకు హీరో హీరోయిన్లతో వీడియోలు రిలీజ్ చేయించాలని కోరారు. అందులో భాగంగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సిద్ధార్థ, సహ సముద్ర ఖని వంటి వాళ్ళు డ్రగ్స్ వినియోగం తప్పంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం 75 రూపాయలు మాక్సిమం 50 రూపాయలు మినిమం పెంచుకుని అమ్ముకునేలా అవకాశం కల్పించింది. అలాగే ఉదయాన్నే మరో షో వేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే ఏపీలో ఎలా పెంచబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. తెలంగాణలో ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Exit mobile version