NTV Telugu Site icon

Thunivu: ప్రమోషన్స్ కి సూపర్ కిక్ ఇచ్చారు…

Thunivu

Thunivu

తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’, ‘కాసేదాన్ కడవులదాన్’ సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఘిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తునివు ఆల్బం నుంచి మూడో సాంగ్ ని డిసెంబర్ 25న రిలీజ్ చేయ్యనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘గ్యాంగ్స్టా’ అనే పేరుతో బయటకి రానున్న ఈ సాంగ్ ‘తునివి’ సినిమాకే హైలైట్ అవనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

తునివు సినిమాని ‘రెడ్ జైంట్ మూవీస్’ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఓవరాల్ గా తమిళనాడులో ఉన్న థియేటర్స్ లో 66% థియేటర్స్ కి తునివు సినిమాకి కేటాయిస్తున్నారు. ఈ విషయమై దిల్ రాజు, తన ‘వారిసు’ సినిమాకి ఎక్కువ థియేటర్స్ కావాలి అంటున్నాడు. తునివు, వారిసు సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ తోనే రిలీజ్ అవుతున్నాయి. జనవరి 11న తునివు రిలీజ్ అవనుండగా, 12న వారిసు సినిమా విడుదలవుతోంది. అజిత్, విజయ్ ఫాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఇలాంటి సమయంలో అజిత్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి విజయ్ సినిమాకి తక్కువ థియేటర్స్ ఇస్తే ఫ్యాన్ వార్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరి ఈ సెన్సిటివ్ సిచ్యువేషణ్ ని ‘రెడ్ జైంట్’ ఎలా డీల్ చేస్తుందో చూడాలి.