Site icon NTV Telugu

Thug life : ఆకట్టుకుంటున్న కమల్ ‘జింగుచా’ సాంగ్..

Thug Life

Thug Life

Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మరో హీరో శింబు కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని జూన్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ జింగుచా అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. మంచి ఆదరణ దక్కుతోంది. జింగుచా పాటలో కమల్ హాసన్ తో పాటు శింబు ఆడిపాడారు. ఫ్యామిలీ ఫంక్షన్ లో వీరిద్దరూ సంప్రదాయ బట్టల్లో కనిపిస్తూ చేసిన హంగామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని మూవీ టీమ్ చెబుతోంది.

Read Also : Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. మంగ్లీ, శ్రీకృష్ణ, ఆషిమా మహాజన్ సాంగ్ పాడారు. ఇక సినిమా విషయానికి వస్తే గ్యాంగ్ స్టర్ అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే థగ్ లైఫ్ ఇంటెన్స్ డ్రామాతో తీస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్, సన్యా మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version