Chiranjeevi: టాలీవుడ్ అంటే నాలుగు ఫ్యామిలీలు. మెగా, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల మధ్య సినిమాల విషయంలో పోటీ ఉంటుంది కానీ వీరి కుటుంబాల మధ్య కాదు.. ఈ నాలుగు కుటుంబాల హీరోల మధ్య స్నేహ సంబంధం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఇదుగో ఈ ఫోటోల రూపంలో వారి స్నేహ బంధం బయటపడుతూ ఉంటుంది. చిరు- బాలయ్య మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం కలవకపోయినా ఏ ఫంక్షన్ లో కనిపించినా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొంటూ కనిపిస్తారు.
ఇక ప్రస్తుతం ఒక త్రో బ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూస్తుంటే ఈ ఫోటో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సమయంలో తీసినట్లు తెలుస్తోంది. శోభనపు పెళ్ళికొడుకు అవతారంలో బెడ్ పై కూర్చున్న చిరుతో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న బాలయ్య ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టినట్లు కనిపిస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి బాలకృష్ణ గెస్టుగా వచ్చారట. మొదటి షాటే శోభనం సీన్ కావడంతో చిరు అదే కాస్ట్యూమ్ లో ఉండగా షాట్ అవ్వగానే ఈ హీరోలిద్దరు ఇదిగో ఇలా ముచ్చట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు హీరోల సినిమాలు వచ్చే సంక్రాంతికి పోటీ పడనున్నాయి. మరి వీరిలో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
