సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు కానీ హ్యాట్రిక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి మరోసారి మహేశ్ అండ్ త్రివిక్రమ్ కొలాబోరేట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారి అంచనాలు ఉన్నాయి. ఘట్టమనేని అభిమానులుకి ఫుల్ జోష్ ఇచ్చే రేంజులో ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా బయటకి వచ్చింది. పూనకలు తెప్పించేలా ఉన్న మహేశ్ బాబు లుక్ చూసి ఫాన్స్ ఫిదా అయ్యారు. లేటెస్ట్ గా SSMB 28 గ్లిమ్ప్స్ ని మే 31న రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ రీరిలీజ్ అయ్యే థియేటర్స్ లో SSMB 28 గ్లిమ్ప్స్ ని ప్లే చెయ్యనున్నారు. ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ లతో పాటు ఇంకో టైటిల్ కూడా కన్సిడరేషన్ ఉంచారట. ఈ మూడు టైటిల్స్ లో ఒకదాన్ని లాక్ చేసి మే 31న గ్లిమ్ప్స్ తో పాటు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకోని రిటర్న్ రాగానే కొత్త షెడ్యూల్ ని రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. జూన్ 5న SSMB 28 కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యడానికి త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అయ్యారు. రాబోయే మూడు నెలల పాటు SSMB 28 షూటింగ్ ని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ ని చెయ్యనున్నారు. ఈ మూడు నేలలతో SSMB 28 షూటింగ్ కంప్లీట్ అయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసాడట.
