పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సంవత్సరం ముఖ్యంగా టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రాలలో ఇది ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, “భీమ్లా నాయక్”ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
Read Also : Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్
ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విన్పిస్తున్న వార్త ప్రకారమా “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ లో ఓ సర్ప్రైజ్ ఉండబోతోందట. టైటిల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రముఖ హాస్యనటులు సునీల్, సప్తగిరి, హైపర్ ఆది కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
