Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Back to Back Deaths in Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొన్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కన్నుమూయడం షాక్ కలిగిస్తోంది. ప్రముఖ చిత్ర కారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మిర్యాలగూడలోని తన స్వగృహంలో సోమవారం నాడు గుండెపోటుకు గురయి కన్నుమూశారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 88లో బి నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన ‘దాసి’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసి ఆ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు సైతం అందుకున్నారు సుదర్శన్. అప్పటినుంచి దాసి సుదర్శన్ గా ఆయన గుర్తింపు పొందారు. ఇక వారం రాత్రి 8 గంటల సమయంలో డబ్బింగ్ సినిమాలకు మాటలు అందిస్తూ వచ్చిన శ్రీ రామకృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
Jagapathi Babu: డబ్బున్న పేదవాడిని.. మరో లెజెండ్ కోసం ఎదురు చూస్తున్నా!
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
తమిళ సినీ దర్శకులు శంకర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ఎన్నో తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణ మాటలు అందిస్తూ ఉండేవారు. చివరిగా రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమాకి ఆయన మాటలను అందించారు. సుమారు 74 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఇక తాజాగా సినీ పరిశ్రమకు చెందిన నటుడు ఒకరు కన్నుమూశాడు. ఎన్నో తమిళ, తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. 62 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. ఇక విశ్వేశ్వరరావు స్వస్థలం కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కమెడియన్ గా అలరించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!