Kollywood : తమిళ నెక్ట్స్ స్టార్ హీరోస్ రేస్ లో ఆ నలుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను స్రుష్టించుకుంటున్నారు. అదే వారిని స్టార్ హీరో రేంజ్ కు చేరుస్తోంది.
Also Read : Mollywood : మెగాస్టార్ కు పోటీగా యంగ్ హీరో సినిమా రిలీజ్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఆలిస్ట్ లోకి వచ్చిన నలుగురు హీరోలలో ధనుష్ ముందు వరుసలో ఉన్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ధనుష్ మార్క్ ఎప్పటికీ సేలబుల్లే. స్టోరీస్ సెలక్షన్ దగ్గరనుంచి సామాజిక అంశాలను టచ్ చేయడంలో తనకు ఎవ్వరు సాటిరారు అనిపించుకుంటున్నాడు. ధనుష్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఇమేజ్ తెచ్చుకున్న మరో హీరో కార్తి. యుగానికొక్కడు, ఖైదీ, సర్దార్ సినిమాలతో మంచి మైలేజ్ కొట్టిన సూర్య తమ్ముడు “సర్దార్-2″తో ఇప్పుడు సెట్స్ మీదున్నాడు. రీసెంట్ గా కొట్టిన సత్యం సుందరం హిట్ తో సెటిల్డ్ ఆర్టిస్ట్ గాను ప్రయోట్ అయ్యాడు. తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ కార్తీని ఓన్ చేసుకున్నారు. ఇక శివకార్తికేయన్ వరుస విజయాలతో తమిళ స్టార్లను భయపెడుతున్నాడు.ఏ సినిమా చేసినా వందకోట్లకు తగ్గకుండా వసూళ్లు చేసిపెడుతున్నాడు. దీంతో అతని రేంజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది.ఇప్పుడు ఇదే లీగ్ లోకి తాజాగా ప్రదీప్ రంగనాథన్ ఎంటర్ అయ్యాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడం ఇతనికి తమిళ పరిశ్రమ బాసటగా నిలవడంతో రానున్న రోజుల్లో ఇతనికంటూ స్టార్ డమ్ వస్తుందనే వాళ్లు ఉన్నారు. ఇక యంగ్ హీరో శింబుకు కూడా ఆ స్థాయి ఉందనే చెప్పాలి. లాంగ్ గ్యాప్ తీసుకున్న శింబు తరువాత రాబోతున్న సినిమాలతో హిట్ స్టేటస్ అందుకుని స్టార్ హీరో రేంజ్ కు వెళ్తాడని సినీ క్రిటిక్స్ అభిప్రాయం.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?