Site icon NTV Telugu

Sankranthiki Vasthunam: వెంకటేష్ కోసం క్యూ కట్టిన 4 బ్యానర్లు..

Venkatesh

Venkatesh

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరక్కెకిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ , డైరెక్టర్ అనిల్‌ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి ఏ స్థాయిలో ప్రమోషన్స్‌ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బులితెర పై ఒక షో కూడా వదలకుండా దర్శనమిస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వెంకటేష్ మాట్లాడుతూ ‘ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. ఈ సినిమాలో నా పాత్ర  ఆడియెన్స్‌ను  ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మరోసారి వింటేజ్ వెంకీని చూస్తారు. ఇక ఈ సినిమా తర్వాత నాతో సినిమా చేసేందుకు నాలుగు బ్యానర్లు రెడీగా ఉన్నాయి’ అని తెలిపారు.

ఇక ఈ సంక్రాంతికి రామ్‌ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ , బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా. చివరగా రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందున్నాయి. ముఖ్యంగా ‘ఎఫ్ 2’ సినిమా వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. అందుకే మరోసారి వీరి కాంబోలో వస్తున్నా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వైట్ చేస్తున్నారు.

 

Exit mobile version