NTV Telugu Site icon

Vasuki: పవన్ కళ్యాణ్ చెల్లెలు రీ ఎంట్రీ.. 24 ఏళ్ల తరువాత ఎలా ఉందో చూడండి

Vasuki

Vasuki

Vasuki: వాసుకి ఈ పేరు వింటే ఎవరామె అని అనుకోవడం సహజం. అదే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలు ప్రియ అని చెప్పండి టక్కున ఓ ఆమెనా అని అనేస్తారు. అవును ఆమె పేరే వాసుకి. తొలిప్రేమ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న వాసుకి ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆ ఒక్క సినిమా తప్ప ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆనంద్ సాయి హరిహరవీరమల్లు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వాసుకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తూనే వస్తోంది కానీ మంచి కథ దొరకడంలేదని, అందుకే ఆగుతుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఎట్టకేలకు వాసుకి రీ ఎంట్రీ సిద్ధమైంది.

సీతారామం లాంటి భారీ హిట్ ను అందుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్ని మంచి శకునాలే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ క్యాస్టింగ్ ను రివీల్ చేసింది. ఇందులో భారీ తారాగణమే కనిపిస్తున్నా అందరి చూపు మాత్రం వాసుకి మీదే ఉందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపిస్తుందని అర్ధమవుతోంది. ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. కథ నచ్చడం అందులోనూ టాప్ నిర్మాణ సంస్థలో చేయడం కన్నా రీ ఎంట్రీకు మంచి శకునం ఏముంటుందిలే అనుకున్నదో ఏమో వాసుకి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. దాదాపు 24 ఏళ్ల తరువాత ఆమె కెమెరా ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో వాసుకి టాలీవుడ్ లో రీ ఎంట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను చేజిక్కించుకొంటుందో లేదో చూడాలి.