Site icon NTV Telugu

Nachinavadu: అక్కినేని అమల చేతుల మీదుగా ‘తోడై నువ్వుండక’ సాంగ్ రిలీజ్

Akkineni Amala

Akkineni Amala

Thode Nuvvundaka from Nachinavadu Song Launched by Amala Akkineni: లక్ష్మణ్ చిన్నా కీలక పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన మూవీ “నచ్చినవాడు”. ఇటీవల విడుదల అయిన ఈ నచ్చినవాడు థియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. యూట్యూబ్ లో 20 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించి ఆదరించారు. ఇక ‘నా మనసు నిన్ను చేర’ పాట సహా కొన్ని పాటలు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అవ్వగా ద్వారా విని పాటలు చాలా బాగున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో విడుదలైన “ఎదపొంగెనా ఏమో ” పాట అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఇప్పుడు సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘తోడై నువ్వుండక’ అనే మెలోడీ సాంగ్ ను అక్కినేని అమల విడుదల చేశారు.

SIIMA 2023: సీనియర్ నరేష్ తో రానా, సుమంత్ పోటీ.. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరు?

ప్రముఖ గాయకురాలు సయొనోరా ఫిలిప్స్ ఆలపించిన ఈ పాటను రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో విడుదలయింది. అక్కినేని అమల గారు ‘తోడై నువ్వుండక’ పాటను విని మంచి మెలోడీ పాట అందించిన సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నచ్చినవాడు సినిమా మంచి విజయం సాధించాలి అని తమ అభినందనలు తెలియజేశారు. ఇక ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై సినిమా నిర్మిస్తున్న దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ నచ్చినవాడు సినిమాలోని ‘తోడై నువ్వుండక’, లాంటి మంచి పాటను అమల విడుదల చేయడం చాలా సంతోషం అని, ఈ సినిమా స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం అని అన్నారు., హాస్యానికి పెద్దపీట వేస్తూ, నేటి యూత్ కి కావాల్సిన ప్రతి అంశం ఇందులో పొందుపరిచారని పేర్కొన్న ఆయన ఈ సినిమాను ఆగస్టు 24న విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

Exit mobile version