This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Week OTT Releases: ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సరికొత్త వినోదం వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వాళ్ల కోసం, హాయిగా ఇంట్లో కూర్చుని పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయడానికి విభిన్న జోనర్ల సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిలో తెలుగు హిట్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వస్తున్న టాప్ సినిమాల కథ ముచ్చట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మిస్టర్ మిడిల్ క్లాస్ (Mister Middle Class)
శ్రీకాంత్, లయ లీడ్ రోల్స్ లో నటించిన ఈ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ పూర్తిగా మధ్యతరగతి కష్టాల చుట్టూ తిరుగుతుంది. లీడ్ క్యారెక్టర్ వెంకటరమణకు అద్దెలు, అప్పులు, హాస్పిటల్ ఖర్చులతో జీవితం భారంగా మారుతుంది. ఇలాంటి టైమ్‌లో అతను నమ్ముకున్న ఆ వెంకటేశ్వర స్వామి (రాజేంద్ర ప్రసాద్) స్వయంగా ఒక మ్యాజిక్ బుక్ పట్టుకుని కిందకి వస్తాడు. ఆ పుస్తకం వల్ల అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ స్టోరీ. ఈ సినిమా 2026 జులై 17 న థియేటర్లలో విడుదలైంది. నెల రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, థియేటర్లలో ప్రేక్షకులను బాగా నవ్వించి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. ఈ రోజు (ఆగస్టు 19) నుంచి Aha ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ మూవీ.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
2. ప్యార్ ప్రేమ కళ్యాణం (Pyaar Prema Kalyanam)
దర్శకుడు ఎలాన్ నటుడిగా మారిన ఈ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పెళ్లయిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన పవి అనే అమ్మాయి తన సొంత ఇల్లు వదిలి రానంటుంది. దాంతో భర్తే అత్తగారింటికి ఇల్లరికం వస్తాడు. ఈ రివర్స్ లివింగ్ అరేంజ్మెంట్ వల్ల ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు, నవ్వులు, ఫ్యామిలీ డ్రామాలు జరిగాయనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇందులో ఎలాన్ కు జోడీగా సాన్వే మేఘన నటించగా , రాదికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, గీతా కైలాసం, ఎలాంగో కుమారవేల్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. మేకర్స్ ఈ సినిమాను నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 2026 ఆగస్టు 21న ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
3. ఎన్వాళి తనివాళి (Envazhi Thanivazhi)
ఇదొక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మలయాళ సినిమా. సమాజంలో జరిగే కొన్ని అన్యాయాలు, వాటి వెనుక ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి ఒక వ్యక్తి తన సొంత పంథాలో (నా దారి రహదారి అన్నట్టు) ఎలా పోరాడాడు అనే సీట్ ఎడ్జ్ ఎలిమెంట్స్‌తో ఈ కథ సాగుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. ఆగస్ట్ 18నుంచి Hungama ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ లో ఉంది.
4. జన నాయగన్ (Jana Nayagan)
జన నాయగన్ సినిమా 2026 జులై 23న థియేటర్లలో విడుదలైంది. దళపతి విజయ్ చివరి సినిమాగా థియేటర్లలోకొచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. థియేటర్లలో విజయవంతంగా ఆడి, సరిగ్గా నెల రోజులకు జీ5 లో ఆగస్టు 21నుంచి స్ట్రీమింగ్ కానుంది. సమాజంలో సామాన్యుడు ఎదుర్కొనే రాజకీయ సమస్యలు, వ్యవస్థలో ఉన్న లొసుగులపై ఒక సాధారణ యువకుడు ఎలా తిరగబడ్డాడు, ప్రజల నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. పవర్ ఫుల్ డైలాగ్స్, సోషల్ మెసేజ్ తో ఈ సినిమా సాగుతుంది.
5. చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)
చెన్నై లవ్ స్టోరీ సినిమా 2026 జులై 24న థియేటర్లలో విడుదలైంది. కిరణ్ అబ్బవరం నటించిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు సోనీ లివ్ ద్వారా మీ హోమ్ స్క్రీన్స్ పైకి వచ్చేస్తోంది. SonyLIVలో ఆగస్టు 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన జీవితం అయిపోలేదని, ఆ మొదటి ప్రేమ ముగింపులోనే మరింత నిజమైన, మెరుగైన ప్రేమ దాగి ఉంటుందనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ తరం లవ్, బ్రేకప్, ఎమోషన్స్ ని చాలా నీట్ గా చూపించారు.
6. ఐ నోబడీ ‘I, Nobody’
పృథ్వీరాజ్ సుకూమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘I, Nobody’. నిసామ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 9, 2026 న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ రాబరీ కేసులో చిక్కుకున్న తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఇది తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, థియేట్రికల్ రన్ ముగించుకుని దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఇది JioHotstar లో 2026 ఆగస్ట్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులు దీనిని వీక్షించవచ్చు.
7. Newton’s 3rd Law
హీరో సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రల్లో నటించిన టాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘Newton’s 3rd Law’. రాజేష్ కర్ణ దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా మరియు ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం జులై 31, 2026 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక చర్య జరిగినప్పుడు దానికి ఎలాంటి రియాక్షన్ (ప్రతిచర్య) ఎదురైందనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. థియేటర్లలో మంచి థ్రిల్‌ను పంచిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. ETV Win ఓటీటీ వేదికగా ఆగస్ట్ 27, 2026 (గురువారం) నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
- Tags
- cinema
- JioHotstar
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!