Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hollywood OTT Releases: హాలీవుడ్ అభిమానులకు ఈ వారం ఓటీటీ వేదికలపై వరుస క్రేజీ రిలీజ్లు సందడి చేస్తున్నాయి. డీసీ కామిక్స్ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ‘లాంతర్న్స్’, యాక్షన్ కామెడీ ‘యావరేజ్ జో సీజన్ 2’, అడ్వెంచర్ డ్రామా ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’, పిక్సర్ యానిమేషన్ బ్లాక్‌బస్టర్ ‘టాయ్ స్టోరీ 5’ ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి ఈ సినిమాలు, సిరీస్ లు. మరి ఇవి ఏ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
1. లాంతర్న్స్ (Lanterns – Season 1)
డిసి కామిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన డార్క్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో ఇద్దరు ఇంటర్‌గెలాక్టిక్ పోలీస్ ఆఫీసర్స్ (గ్రీన్ లాంతర్న్స్) అయిన హాల్ జోర్డాన్ (ఓల్డ్ వెటరన్), జాన్ స్టీవర్ట్ (కొత్త రిక్రూట్) చుట్టూ తిరుగుతుంది. అమెరికాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఒక హత్య కేసును దర్యాప్తు చేయడానికి వీరిద్దరూ భూమిపైకి వస్తారు. ఆ దర్యాప్తులో వారికి ఊహించని సంచలన విషయాలు తెలుస్తాయి. ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదని, దీని వెనుక విశ్వాన్ని ముంచేసే ఒక భారీ కుట్ర ఉందని వారు గుర్తిస్తారు. ఇది నేరుగా ఓటీటీ కోసం రూపొందించిన వెబ్ సిరీస్, థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా HBO Max లో 2026 ఆగస్టు 16నుండి స్ట్రీమింగ్ అవుతోంది. వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున విడుదల చేస్తున్నారు.
Also Read
- Shiva: జపాన్‌లో నాగార్జున 'శివ' సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
2. యావరేజ్ జో సీజన్ 2 (Average Joe – Season 2)
ఈ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించింది. మొదటి సీజన్లో తన తండ్రి దాచిపెట్టిన డ్రగ్స్ డబ్బు వల్ల జో వాషింగ్టన్ అతని కుటుంబం రష్యన్ మాఫియా చిక్కుల్లో పడతారు. సీజన్ 2 కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈసారి కథ అంతర్జాతీయ స్థాయికి మారుతుంది. తన తండ్రి గతం నుండి ఎదురైన కొత్త ప్రమాదాల నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జో వాషింగ్టన్ (డీన్ కోల్) మరియు అతని స్నేహితులు సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ వరకు వెళ్తారు. అక్కడ మనుగడ కోసం వారు చేసే పోరాటం, పండించే డార్క్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.థియేట్రికల్ రిలీజ్ డేట్: ఇది కూడా థియేట్రికల్ రిలీజ్ లేని ఒరిజినల్ వెబ్ సిరీస్.ఓటీటీ డీటైల్స్: Paramount+ ఓటీటీలో ఆగస్టు 19, 2026 నుండి గ్లోబల్‌గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
3. ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (Outer Banks – Season 5)
ప్రముఖ అడ్వెంచర్ టీన్ డ్రామా సిరీస్ ‘ఔటర్ బ్యాంక్స్’ ఐదో సీజన్ అద్భుతమైన ట్విస్టులతో డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చింది. ఈ కథ సీజన్ 4 ముగింపులో మొరాకోలో జరిగిన ఘోరమైన దాడుల్లో జేజే మరణించడంతో పోగ్స్ బృందం తీవ్రమైన విషాదంలో మునిగిపోతుంది. వారు పూర్తిగా మానసికంగా, ఆర్థికంగా కృంగిపోతారు. ఈ ఐదో సీజన్లో తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి, అలాగే కోల్పోయిన ‘బ్లూ క్రౌన్’ నిధిని దక్కించుకోవడానికి పోగ్స్ బృందం అత్యంత ప్రమాదకరమైన సాహసయాత్రను ప్రారంభిస్తుంది. ఈ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒరిజినల్ సిరీస్ 2026 ఆగస్టు 20 నుండి మొత్తం 10 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది.
4. టాయ్ స్టోరీ 5 (Toy Story 5)
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద $1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన పిక్సర్ (Pixar) యానిమేషన్ బ్లాక్‌బస్టర్ సినిమా డిజిటల్ పద్ధతిలో ఇంటి వద్దే చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగంలో టెక్నాలజీ వల్ల బొమ్మల ఉనికి ఎలా ప్రమాదంలో పడిందనే సరికొత్త పాయింట్‌ను చూపించారు. ఇందులో చిన్నారి బోనీ ఇప్పుడు స్మార్ట్ టాబ్లెట్ గ్యాడ్జెట్స్, ‘లిలిప్యాడ్’ అనే సరికొత్త ఎలక్ట్రానిక్ బొమ్మకు ఆకర్షితురాలవుతుంది. దీనివల్ల పాత సాంప్రదాయ బొమ్మలైన ఉడీ, బజ్ లైట్‌ఇయర్ వారి స్నేహితులను బోనీ పట్టించుకోవడం మానేస్తుంది. టెక్నాలజీ యుగంలో పిల్లల జీవితాల్లో తమ ప్రాధాన్యతను నిలుపుకోవడానికి ఈ బొమ్మలు పడే ఇబ్బందులు, సాగించే ప్రయాణమే ఈ సినిమా కథ. ఈ మూవీ 2026 జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. 2026 ఆగస్టు 18 నుండి Amazon Prime Video, Apple TV, Google Play లలో రెంటల్ / పర్చేజ్ విధానంలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..