స్టార్లు అందరికి అభిమానులు ఉంటారు.. కానీ కొంతమంది స్టార్లకు మాత్రమే భక్తులు ఉంటారు.. వారి వ్యక్తిత్వానికి ఫిదా అవుతారు.. అలంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.. పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ .. ఆయనకు అభిమానులు భక్తులు మాత్రమే ఉంటారు.. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా భక్తులకు అలాంటివేమీ పట్టవు.. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. జీవితాంతం పవన్ అభిమానినే అంటూ ఉంటారు.. ఇక హీరోల విషయాన్నీ పక్కన పెడితే హీరోయిన్లలో పవర్ స్టార్ ట్యాగ్ అందుకునే అర్హత కేవలం ఒక్క సాయి పల్లవి కి మాత్రమే ఉందని అభిమానులు అంటున్నారు. ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. కథలను ఎంపిక చేసుకొనే విధానంలోనే సగం గెలిచేసింది.. గ్లామర్ పాత్రలకు కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం.. రియలిస్టిక్ గా నటించడంతో అభిమానులు ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. ఇక మరు ముఖ్యంగా సాయి పల్లవి కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిత్వం.. గ్లామర్ పాత్రలకు నో చెప్పడంతో పాటు తనకు ఇబ్బంది కలిగించే ఎలాంటి అవుట్ ఫిట్ ను వేసుకోనని తెలుపుతూ నిండుగా సంప్రదాయబద్ధమైన దుస్తులలోనే దర్శనమిస్తూ ఉంటుంది. ఇక డబ్బు కోసమో, పేరు కోసమే అబద్దాన్ని నిజం అని చెప్పలేనని ఫేస్ క్రీమ్ యాడ్స్ కు నో చెప్పడం ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది.
ఇక ఇవన్నీ ఆమెకు అంతటి అభిమానులను తెచ్చి పెట్టాయి. ఆమె ఏ సినిమాలో ఉంటె ఆ సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చేస్తుంది.. ఒక స్టార్ హీరోనే సాయి పల్లవి నే ఈ సినిమాకు హీరో అన్నాడు అంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక సాయి పల్లవి క్రేజ్ ఎలాంటిదో ఒక ఉదాహరణ.. నిన్న విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్నూల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది… స్టేజి మొత్తం రెడీ చేశారు.. కానీ అంతలోనే చిన్న అపశృతి చోటుచేసుకుంది.. గాలివాన కు ఆ స్టేజి కూలిపోయింది. సాధారణంగా వేరే ఎవరైనా అయితే ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకొనేవారు.కానీ సాయి ప్లాలవి మాత్రం అభిమానులు తన కోసం చూస్తున్నారని తెలిసి గాలివాన లెక్కచేయకుండా వర్షంలోనే తడుస్తూ స్పీచ్ ఇచ్చింది.. అక్కడ ఉన్నది సాయి పల్లవి అని తెలిసిన అభిమానులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె మాటలు వింటూ నిలబడ్డారు.. ఎలాంటి సంఘటనలు స్టార్ హీరోల విషయంలో జరుగుతూ ఉంటాయి .. కానీ మొదటిసారి ఒక హీరోయిన్ కోసం అంతమంది అభిమానులు వర్షంలో తడుస్తూ నిలబడడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి.అందుకే ఆమె నిజంగానే లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Thankyou @RanaDaggubati 🙏🙏🙏🙏 Gaaru for supporting @Sai_Pallavi92 Gaaru 😍😍#SaiPallavi #RanaDaggubati #VirataParvam Trailer Launch Event Kurnool#VirataParvamOnJune17th 💥 pic.twitter.com/pHRBi7FOKk
— Sai Pallavi 🤍 (@92Saipallavi) June 6, 2022