Site icon NTV Telugu

Exclusive : అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఇదే

Ghaati

Ghaati

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క.  గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది.

Also Read : Tollywood : మన సినిమాలు.. మనకే తిరిగి చూపిస్తున్న ఇతర ఇండస్ట్రీలు

కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. షూట్ డిలే కారణంగా కీలకమైన సీన్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా వేశారు మేకర్స్. ఇక ఇప్పడు షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనేక వాయిదాలు, అనేక తర్జన భర్జనలు అనంతరం ఘాటీని సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఘాటీ ట్రైలర్ ను ఈ బుధవారం రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. వేదం తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న అనుష్క మరోసారి అరుంధతి, భాగమతి రేంజ్ హిట్ కొడుతుందని యూనిట్ భావిస్తోంది.

Exit mobile version