Site icon NTV Telugu

Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి బ్రేక్.. ఇదే కారణమా.. ?

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: ఫిదా మూవీతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. హీరోయిన్ అంటే మచ్చలేని అందం ఉండాలి.. అందాల ఆరబోత చేయాలి.. హీరోలతో రొమాన్స్ చేయాలి.. అని అనుకునేవారికి.. నటన ముందు అవేమి అడ్డు రావు అని నిరూపించిన బ్యూటీ సాయి పల్లవి. ఇప్పటివరకు ఆమె చేసిన అన్ని సినిమాలు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్నవే కానీ, గ్లామర్ గా కనిపించినవి కానీ, ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు అని విమర్శించిన వారు ఒక్కరు లేదు. అలా ఆమె కథలను ఎంచుకుంటుంది. ఇక విరాట పర్వం సినిమా తరువాత సాయి పల్లవి కొత్త సినిమాను ప్రకటించిందే లేదు. దీంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇస్తుందని, పెళ్లి చేసుకుంటుందనని, హాస్పిటల్ కడుతుందని, సినిమాలు ఇక చేయదు అని ఏవేవో వార్తలు వచ్చేశాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. మరి గ్యాప్ ఎందుకు తీసుకున్నది అంటే.. సాయి పల్లవి గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అంతే.

Payal Rajput : పాయల్ నటించిన మంగళవారం టీజర్ విడుదల ఎప్పుడో తెలుసా..?

ఆమె దగ్గరకు వచ్చే కథలు అన్ని ఆమె ఓకే చేయదు. తనకు, తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలనో అన్ని చూసుకొని సినిమను ఓకే చేస్తోంది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా సాయి పల్లవికి విమర్శలను తీసుకోవడం రాదు. అందుకని.. అలాంటి విమర్శల జోలికి వెళ్లకుండా ఎలాంటి పాత్రను అయితే ప్రేక్షకులు ఆదరిస్తారో.. అలాంటివే చేస్తూ వచ్చింది. కథ, కథనం, తన పాత్ర.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోగలరా ఇవన్నీ ఆలోచించుకొని ఒక్కో అడుగు వేస్తోంది. అందుకే ఆమె సినిమాలు లేట్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి.. శివ కార్తికేయన్ సరసన ఒక సినిమా చేస్తోంది. మరి ముందు ముందు తెలుగులో ఈ చిన్నది ఏ స్టార్ హీరో సరసన కనిపిస్తుందో చూడాలి.

Exit mobile version