మాలీవుడ్ స్టార్ బ్యూటీ రజిషా విజయన్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు మలయాళంలో హాట్ టాపిక్ అయ్యింది. మస్తిష్క మరణం మూవీలో స్పెషల్ సాంగ్‌లో ఎక్స్ పోజింగ్ చేయడంతో నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గర్ల్‌గా, పద్దతిగా కనిపించిన మన రజీషాయేనా అని ఫీలయ్యేలా స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్‌తో కట్టిపడేస్తోంది. ఐటమ్ గర్ల్‌గా అదరగొట్టిందని, మరో విద్యాబాలన్ అంటూ పొగిడేస్తున్నారు. కానీ అదే టైంలో గతంలో చేసిన కామెంట్స్‌తో నెటిజన్లు రజిషాను ఆడేసుకుంటున్నారు.
Also Read : Rashmika Mandanna : ఉదయ్‌పూర్ లో పెళ్లి వేడుక.. రష్మిక కామెంట్స్ వైరల్
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐటమ్ సాంగ్స్ చేయడం తనకు ఆసక్తి లేదని, తనను, తన బాడీని ఓ వస్తువుగా చూడకూడదన్న ఉద్దేశంతో స్పెషల్ నంబర్స్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పింది రజీషా. ప్రజెంట్ ఆ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంతా మనీ మేటర్స్ అంటూ కౌంటరిస్తున్నారు. ఇంకొంత మంది ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. కథకు అవసరమైతే పెప్పీ స్టెప్స్ వేస్తానని చెప్పిందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రజీషా ఐటమ్ సాంగ్‌తో రచ్చైతే చేసి అటెన్షన్‌ను తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. 2016లో ఓన్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన రజీషా కెరీర్‌ను మార్చేసిన ఫిల్మ్ కర్ణన్. తెలుగులో రవితేజ ఫిల్మ్ రామారావు ఆన్ డ్యూటీలో చేసింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు అమ్మడు. కేవలం మాలీవుడ్, కోలీవుడ్‌కే పరిమితమైంది. మరీ కెరీర్‌లో ఫస్ట్ టైం చేసిన ఐటమ్ సాంగ్‌తో మళ్లీ టాలీవుడ్ పిలుస్తుందేమో చూడాలి.
