టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’ ఈ శుక్రవారం (ఏప్రిల్ 17) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఎస్.పి. దుర్గా నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990ల నాటి గోదావరి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్) తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక చిన్న సంఘటన వల్ల పంచాయితీలో ఎదురైన అవమానం.. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. ఇందులో అజయ్ ఘోష్, రాశి, రఘు బాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. కె.ఎమ్. రాధాకృష్ణ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను హోరెత్తిస్తోంది. అయితే,
Also Read : Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!
తాజాగా తిరువీర్ ఐపీఎల్ (IPL) మ్యాచ్‌తో తన సినిమాను పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 17న ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (GT vs KKR) మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. దీనిపై తిరువీర్ స్పందిస్తూ.. ‘థియేటర్స్‌కి రండి.. మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను. 17న జరిగే గుజరాత్ vs KKR మ్యాచ్ కన్నా మా సినిమా బాగుంటుంది’ అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. క్రికెట్ పిచ్చితో ఉన్న ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు తిరువీర్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
