Site icon NTV Telugu

Thindibothu Deyyam: అసలే దెయ్యం, ఆపై తిండిబోతు.. ఇక కాస్కోండి!

Thindibothu Deyyam

Thindibothu Deyyam

Thindibothu Deyyam Movie Started: తెలుగులో దెయ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అదే క్రమంలో నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా ‘తిండిబోతు దెయ్యం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు పూజా కార్యక్రమాలతో సినిమా నేడు ప్రారంభమైంది. నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు.

Sundar C: తెలుగు సినిమాలపై ఖుష్బూ భర్త సంచలన ఆరోపణలు.

ఈ సినిమాకి సంబంధించి మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడు, నంది అవార్డు గ్రహీత రేలంగి నరసింహారావు క్లాప్ నివ్వగా.. నిర్మాత శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ కామెడీ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంశమే. సినిమాలో కామెడీకి తిరుగులేదు, ఉండదుకూడా. అయితే.. దీనిని చక్కగా డీల్ చేసి తీస్తే విజయబావుటా ఎగుర వేయడం ఖాయం అన్నారు. కామెడీ టచ్ తో కూడిన చిత్రానికి హర్రర్ మిళితం చేస్తే.. ఇక చెప్పేదేముంది? అని అన్నారు. దర్శక నిర్మాత, హీరో ‘నరసింహ బోదాసు’ మాట్లాడుతూ.. కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని ఈ నూతన సినీ నిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం, ప్రొడక్షన్ నెం.1గా మా ‘తిండిబోతు దెయ్యం’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం, ఈ సినిమాలో కొత్తదనం ఉంటుందని అన్నారు.

Exit mobile version