Site icon NTV Telugu

Viswaksen : విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్ట్

Vishwaksen

Vishwaksen

Viswaksen : హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన టాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఈ చోరీ చేసిన దొంగలను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెంబర్-8లో ఉంటున్న విశ్వక్ సేన్ ఇంట్లో మార్చి 16న చోరీ జరిగింది. దీంతో విశ్వక్ సేన్ తండ్రి సి.రాజు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు ముగ్గురు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. స్వరాజ్, కార్తీక్, సందీప్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

read also : Merchant Navy officer Murder: ఇది భార్య కాదు, మానవ మృగం.. పక్కా ప్లాన్, లవర్‌‌ని నమ్మించి భర్త హత్య..

విశ్వక్ సేన్ ఇంట్లోని మూడో అంతస్తులో ఆమె సోదరి ఉంటుంది. అయితే 16వ తేదీ తెల్లవారు జామున ఆమె లేచి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. ఆమె విషయాన్ని తండ్రికి చెప్పింది. రెండు బంగారు డైమండ్ ఉంగరాలు పోయాయని.. వాటి విలువ రూ.2.20లక్షలు ఉంటుందని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారు జామున ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ ఉంచి.. నేరుగా మూడో అంతస్తులోకి వెళ్లినట్టు పోలీసులు సీసీ ఫుటేజీలో గుర్తించారు. తాజాగా వారిని పట్టుకుని దొంగల నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

Exit mobile version