NTV Telugu Site icon

NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్

Sialesh Kolanu

Sialesh Kolanu

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా హిట్ 3. హిట్ 3 ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అదరగొట్టాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ఓ విషయం లో మాత్రం భాదపడుతూ ఎక్స్ లో పోస్ట్ చేసాడు.

Also Read : Kollywood : తమిళ నెక్ట్స్ స్టార్ హీరోస్ రేస్ లో ఆ నలుగురు

హిట్ 3 లో కోలీవుడ్ స్టార్ నటుడు నటిస్తున్నాడన్న సంగతి చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది యూనిట్. ఆడీయన్స్ కు సర్పైజ్ ఇద్దాం అని కార్తీ రోల్ ను సూపర్ గా డిజైన్ చేశారట. కానీ కొందరు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డైరెక్టర్ కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై ఎక్స్ లో ‘ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ తెలిస్తే దాన్ని ముందు వెనక ఆలోచించకుండా లీక్‌ చేసేందుకు ఒక్క సెకను కూడా ఆలోచించట్లేదు. ఆడియెన్స్ కు మంచి అనుభూతి ఇచ్చేందుకు తెర వెనుక ఎంతోమంది పగలూ రాత్రీ అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. స్పెషల్ మొమెంట్స్, సర్ప్రైజ్ లు ఇచ్చేందుకు ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. కానీ కొందరు వారి వారి స్వార్ధం కోసం అలాగే మరికొందరు జర్నలిస్టులు రీచ్ కోసం గోప్యంగా ఉంచాల్సిన విషయాలను లీక్ చేయడం బాధాకరం. ఏది లీక్ చేయకూడదు, ఏది లీక్ చేయాలనే బేసిక్ సెన్స్ ఉండాలి. ఇలా చేయడం తప్పో.. ఒప్పో మీకు మీరే ఆలోచించుకోకుండి. ఈ రకమైన రిపోర్టింగ్ కేవలం చిత్ర బృందం కష్టాన్ని దొంగిలించడం కాదు, ఇది ప్రేక్షకుల నుండి నేరుగా దొంగిలించడంతో సమానం’ అని పోస్ట్ చేసారు.