Site icon NTV Telugu

Sitaramam: ‘సీతారామం’ ను వదులుకున్న స్టార్ హీరోలు వీరేనట..?

Ram

Ram

Sitaramam:చిత్ర పరిశ్రమలో ఒక హీరో వద్దకు వెళ్లిన కథ మరో హీరో దగ్గరకి వెళ్తూనే ఉంటుంది. కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు. మరికొంతమంది వేరే కారణాల వలన రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ కథలో హీరోగా ఎవరైతే సెట్ అవుతారో అది ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు అనేది నమ్మదగ్గ నిజం.. సీతారామం చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ ను తప్ప మరే హీరోను ఉహించుకోలేము.. ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో రామ్ గా దుల్కర్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ హీరో కన్నా ముందు ఇద్దరు స్టార్ హీరోలు సీతారామం ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారు ఎవరంటే.. న్యాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

ఇద్దరూ లవర్ బాయ్స్.. లవ్ స్టోరీ లు తీయాలంటే నాని తరువాతే ఎవరైనా అని నిన్నుకోరి చూశాక చాలామంది చెప్పుకొచ్చారు. ఇక రామ్ మొదటి నుంచి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ ఇలాంటి లవ్ స్టోరీ లు చేయడంలో సిద్దహస్తుడే. అయితే కొన్ని కారణాల వలన ఈ ఇద్దరు హీరోలు సీతారామం కథను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఒక వేళ ఈ ఇద్దరు హీరోల్లో ఏ ఒక్కరైనా ఈ సినిమా చేసి ఉంటే ఈ రిజల్ట్ వేరుగా ఉండేదని, ఇంతకన్నా హైప్ వచ్చేదని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా రామ్, నాని తమ కెరీర్ లో ఒక మంచి లవ్ స్టోరీ ను మిస్ చేసుకున్నారు అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాతో దుల్కర్ తెలుగువాడిగా మారిపోయాడు. ఏదైనా ఎవరికి రాసిపెట్టి ఉన్నది వారికే దక్కుతుంది అని దీనిబట్టి అర్ధమవుతోంది అని అంటున్నారు అభిమానులు.

Exit mobile version