Site icon NTV Telugu

Cameo Roles: అప్పుడు రోలెక్స్… ఇప్పుడు నరసింహ…

Cameo Roles

Cameo Roles

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా, కమల్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. కమల్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు విక్రమ్ మూవీ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని క్రియేట్ చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన విక్రమ్ సినిమా రేంజ్ ని మరింత పెంచింది క్లైమాక్స్ లో ‘సూర్య’ క్యామియో. రోలెక్స్ పాత్రలో సూర్య ఇచ్చిన పవర్ ఫుల్ ఎంట్రీకి మూవీ లవర్స్ థియేటర్స్ లో గోల పెట్టారు. లిటరల్లీ విక్రమ్ సినిమా మొత్తం ఒకెత్తు, లాస్ట్ లో సూర్య vs కమల్ ఫ్రేమ్ ఒకెత్తు. ఆ రేంజ్ ఇంపాక్ట్ ని కేవలం 5-6 నిమిషాల క్యామియోతోనే ఇచ్చాడు సూర్య. అందుకే విక్రమ్ సినిమా చూసిన వాళ్లు రోలెక్స్ పాత్ర స్పిన్ ఆఫ్ మూవీ చేయమని లోకేష్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా రోలెక్స్ క్యామియో రేంజులో ఇంపాక్ట్ చూపించిన సినిమా జైలర్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ క్యామియోస్ ప్లే చేసారు. రజినీ, మోహన్ లాల్, శివన్నలని టెర్రిఫిక్ గా చూపిస్తూ నెల్సన్ క్లైమాక్స్ ని డిజైన్ చేసిన విధానం ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెస్తుంది. ముఖ్యంగా జైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది శివన్న పేరు. జైలర్ సినిమాలో నరసింహ పాత్రలో నటించిన శివన్న క్లైమాక్స్ లో స్లో మోషన్ లో ఎంటర్ అవ్వగానే ఆడియన్స్ థియేటర్స్ టాపు లేచిపోయే రేంజులో అరుస్తున్నారు. మాములుగా రజినీకాంత్ సినిమాలో రజినీని కాకుండా ఇంకొకరి గురించి మాట్లాడడం అనేది జరగని పని. అలాంటిది శివన్న ఒక్క డైలాగ్ లేకుండా మాస్ లుక్స్ తో, స్లో మోషన్ వాక్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. శివన్న కారణంగా కర్ణాటకలో జైలర్ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. కోలీవుడ్ మూవీ లవర్స్ అంతా శివన్న సినిమాలని బింగే వాచ్ చేస్తున్నారు. విక్రమ్ కి రోలెక్స్ ఎలానో జైలర్ శివన్న అలా అయ్యాడు. మరి ప్రస్తుతం ఘోస్ట్ అనే గ్యాంగ్ స్టర్ సినిమా చేస్తున్న శివన్న, జైలర్ ఇచ్చిన పాన్ ఇండియా ఐడెంటిటీతో మొదటి పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version