NTV Telugu Site icon

Shivathmika Rajashekar: అలాంటి పాత్రల కోసమే ఇలా చేస్తున్నావా పాపా..

Shivatmika

Shivatmika

Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని అనే సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కూడా అవార్డును అందుకుంది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ అమ్మడికి మాత్రం వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఆకాశం, మీట్ క్యూట్, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించినా.. శివాత్మికకు మాత్రం స్టార్ అనే స్టేటస్ దక్కలేదు. ఇక మొదట నుంచి కూడా ఆమె గ్లామర్ రోల్స్, మేకప్ వేసుకొని నటించడానికి ఇష్టపడుతుందట. అయితే ఇప్పటివరకు అలాంటి పాత్రలు రాలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చాలా బాధపడింది. అందుకనేనేమో.. ఆ గ్లామర్ ను మొత్తం తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో శివాత్మిక ఇన్స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక గత కొన్నిరోజుల నుంచి అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుంది. చీరకట్టులో అయినా క్లివేజ్ షోతో మతులు పోగొడుతుంది.

మొన్నటికి మొన్న బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో థైస్ అందాలతో అదరగొట్టిన ఈ చిన్నది.. ఇక ఇప్పడూ చీరలో క్లివేజ్ షో చేస్తూ కనిపించింది.అయితే ఎందుకు ఈ అందాల ఆరబోత అంటే.. గ్లామర్ ఛాన్స్ ల కోసమే అని అంటున్నారు నెటిజన్లు. తాను ఎలాంటి పాత్రలకైనా సిద్దమే అని చెప్పకనే చెప్తోందని చెప్పుకొస్తున్నారు. అయితే అమ్మడికి అసలు గ్లామర్ పత్రాలు సెట్ అవుతాయా అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. శివాత్మికను చూడగానే ఒక తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది.. ముఖ్యంగా ఆకాశం సినిమాలో ఆమె నటన, పలికించిన హావభావాలకు అభిమానులు ఫిదా అయ్యారు. అలా డీ గ్లామర్ రోల్స్ లో, పాత్రకు ప్రాధాన్యత ఉన్నసినిమాల్లో కనిపిస్తే.. శివాత్మిక మరింత పేరు తెచ్చుకొనే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇలా అందాల ఆరబోత కాకుండా మంచి కథలను ఎంచుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.

Show comments