NTV Telugu Site icon

TOP 10 : రీరిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే

Top 10

Top 10

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే రీరిలీజ్ ట్రెండ్. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను అప్ గ్రేడ్ చేసి హై క్వాలీటితో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. వీటిలో బాలీవుడ్, హాలీవుడ్, తమిళ సినిమాలు ఉన్నాయి. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ రాబట్టిన రీరిలీజ్ సినిమాల లిస్ట్ చుస్తే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది బాలీవుడ్ సినిమా ‘తుంబాడ్’.

Also  Read : HIT : ‘హిట్ 3’ ఒక్కరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు

గతేడాది రీరిలీజ్ అయిన ‘తుంబాడ్’  సినిమా రూ. 37.5 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఇటీవల విడుదలైన సనమ్ తేరి కసం కేవలం 6 రోజుల్లో రూ. 28.3 కోట్లు రాబట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గిల్లి రూ. 26.5 కోట్లతో మూడవ ప్లేస్ లో ఉంది. ఇక రణబీర్ కపూర్ ఏ జవానీ హై దివాని రూ. 25. 4 కోట్ల తో నాలుగవ స్థానం, హాలీవుడ్ జెమ్ ఇంటర్ స్టెల్లార్ ఆరు రోజుల్లో రూ. 18.3 కోట్లు కలెక్ట్ చేసి ఐదవ స్థానం, హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ టైటానిక్ రూ. 18 కోట్లు, అమితాబ్ అలనాటి క్లాసిక్ షోలే 3D ఫార్మాట్ లో రూ.13 కోట్లు, లైలా మజ్ను రూ. 11.60 కోట్లు, రణబీర్ రాక్ స్టార్ రూ. 11.5 కోట్లు, జేమ్స్ కామెరూన్ హాలీవుడ్ అడ్వెంచర్ అవతార్ రూ. 10 కోట్ల గ్రాస్ తో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది,తొమ్మిది, పది ప్లేస్ లో నిలిచాయి.