NTV Telugu Site icon

Mahesh: బాబు బర్త్ డే రోజు సర్ప్రైజ్ లు ఏం ఉండవా?

Mahesh Babu

Mahesh Babu

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఘట్టమనేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటారు. 24 గంటల ముందు నుంచే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని కబ్జా చేసి సందడి చేస్తూ ఉంటారు. మహేష్ బాబు బర్త్ డే రోజున ఎవరు ఎలాంటి విషెష్ చెప్పారు, ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది? మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా అని ఈగర్ గా చూస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే జోష్ లో ఆగస్టు 9న సోషల్ మీడియాలో సందడి చేయడానికి రెడీ అయ్యారు కానీ సంబరాలు చేసుకోవడానికి ఫ్యాన్స్ కి మహేష్ నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ముందుగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అనౌన్స్మెంట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ థమన్ నుంచి సాంగ్ ఫైనల్ అవ్వాలి, దానికి టీమ్ అప్రూవల్ ఇవ్వాలి, ఆ తర్వాత సాంగ్ బయటకి రావాలి.

ఈ ప్రాసెస్ జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మహేష్ కి బర్త్ డే విషెష్ చెప్తూ చిన్న వీడియో ఏమైనా గుంటూరు కారం నుంచి బయటకి రావచ్చేమో కానీ అంతకన్నా పెద్ద సర్ప్రైజ్ లు ఉండకపోవచ్చు. ఇక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా బజ్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ గురించి కూడా ఆగస్టు 9న ఒక క్లారిటీ వస్తుందని భావించారు. ఆ రోజు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కానీ రాజమౌళి డిసెంబర్ వరకూ SSMB 29 గురించి మాట్లాడే అవకాశం కనిపించట్లేదు. ఇక ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్టు 9న బయటకి రానున్న ఒకే ఒక్కటి బిజినెస్ మాన్ సినిమా. ఈ మూవీ రీరిలీజ్ అయితే థియేటర్స్ లో సందడి చేయాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు బర్త్ డేకి ఇంతకన్నా పెద్ద అప్డేట్స్ ఉండకపోవచ్చు, మరి సడన్ సర్ప్రైజ్ లు ఏమైనా ఉంటాయేమో చూడాలి.