Site icon NTV Telugu

Aishwarya Rajinikanth: ధనుష్ మాజీభార్య ఇంట్లో దొంగతనం.. లక్షల్లో నగదు మాయం

Danush

Danush

Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె లేని సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు.. ఆమె లాకర్ లోని విలువైన నగలను, కొంత నగదును చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం ఇంటికి వచ్చిన ఐశ్వర్య తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదు అనుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఒక విలువైన నెక్లస్ చోరీకి గురయ్యిందని, దాని విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని ఐశ్వర్య తెలిపింది. ఈ దొంగతనం ఇంట్లో ఉండే పనివారే చేశారని పోలీసులు అనుమానిస్తుండగా.. వారిపై తనకు పూర్తి నమ్మకం ఉంది అని, కానీ ఒకవేళ వారు చేయకపోయినా వేరొకరికి హెల్ప్ చేసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఇలాగే డబ్భులు, నగలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులు ఆ దిశలో కూడా విచారణ చేపట్టారు. ఐశ్వర్య రజినీకాంత్.. ఈ గతేడాది భర్త ధనుష్ తో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె లాల్ సలామ్ అనే సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ నటించడం విశేషం. మరి ఐశ్వర్య ఇంట్లో చోరీకి పాల్పడిన వారు ఎవరైఉంటారు అనేది తెలియాలంటే పోలీసులు దొంగను పట్టుకొనేవరకు ఆగాల్సిందే.

Exit mobile version