Vijay Devarakonda: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ‘THE’ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అనసూయ ఏ ముహూర్తాన ఈవివాదాన్ని మొదలుపెట్టిందో .. అది కాస్తా ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ కు అనసూయకు మధ్య విబేధాలు తలెత్తాయి. అప్పటి నుంచి విజయ్ పై అనసూయ.. కుదిరినప్పుడల్లా అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. ఇక రెండు రోజుల క్రితం విజయ్ పేరు ముందు ఉన్న ‘THE ‘ ని పాయింట్ అవుట్ చేసి ఒక ట్వీట్ వేసిన విషయం తెల్సిందే. పైత్యం అంటూ కొద్దిగా ఘాటుగానే చెప్పుకొచ్చింది. ఇక రౌడీ హీరోను అనేసరికి రౌడీ బాయ్స్.. అనసూయను ఆడేసుకుంటున్నారు. ఆంటీ.. ఆంటీ అంటూ ఆమెను అసభ్యకరమైన పదజాలంతో ఏకిపారేస్తున్నారు. వాటిని కూడా అను.. ట్వీట్ లో షేర్ చేసి.. ఇలా ఉన్నారు దొంగ.. బంగారు కొండలు అంటూ చూపించింది కూడా.. ఇక ఆ ‘THE’ వివాదంపై విజయ్ స్పందించలేదు కానీ,దాన్నే బ్రాండ్ గా చేసుకున్నాడు.
Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే
ఇప్పటివరకు ఒక నార్మల్ పేరుగా ఉన్న విజయ్ దేవరకొండ ముందు ‘THE’ అనే బ్రాండ్ వచ్చి చేరింది. రేపు ఈ రౌడీ హీరో పుట్టినరోజు.. దీంతో విజయ్ కామన్ బర్త్ డే డీపీని డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. అందులో ‘THE’ నే హైలైట్ గా చేసి విజయ్ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన ఒక్కరేనా.. విజయ్ కు విష్ చేసిన ప్రతి ఒక్కరు ‘THE’ ని హైలైట్ చేస్తూ విష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘THE’ అనేది ఒక బ్రాండ్ గా మారింది. మెగాస్టార్, పవర్ స్టార్ ఎలా బ్రాండ్ అయ్యిందో.. ఇప్పుడు ‘THE’ అనగానే విజయ్ దేవరకొండ పేరును గుర్తు చేసేలా చేసింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. విజయ్ పై అనసూయ వెళ్లగక్కిన అక్కసు.. అతనికి ఇలా ఉపయోగపడింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
https://twitter.com/harish2you/status/1655569405353381890?s=20
