Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంతలా నవ్వడం ఎప్పుడైనా చూశారా?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఈ మధ్యకాలంలో ప్రచార సభలు, ర్యాలీలు అంటూ తీరిక లేకుండా తిరగడంతో పవన్ అనారోగ్యం పాలైన విషయం తెల్సిందే. నిత్యం సీరియస్ ముఖంతో కనిపించే పవన్ తనివితీరా నవ్వుతూ కనిపించారు. అందుకు కారణం ఒక సినిమా ట్రైలర్. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కళాపురం. జీ స్టూడియోస్ ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, సంచిత పూనాచ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

జ్వరం కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఈ ట్రైలర్ చూస్తూ పగలబడి నవ్వారు. ఎన్నోరోజుల తరువాత పవన్ మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ ను అంతగా నవ్వించిన ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. మరి ఈ రాజకీయాలను పక్కన పెట్టి పవన్ ఈ సినిమాను ఎప్పుడు ముగిస్తాడో, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version