NTV Telugu Site icon

The Trail: థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..

The Trail

The Trail

The Trail: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేదు. కథ బావుంటే.. చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక ఎంతపెద్ద స్టార్లు ఉన్నా కూడా కథలేకపోతే ప్రేక్షకులు మెచ్చడం లేదు. అందుకే చిన్న కథలు రావడం ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ది ట్రయల్. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ గన్ని దర్శకత్వం వహించాడు. ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha: ‘బజార్’ కు ఎక్కిన సమంత.. లక్షల విలువ చేసే డ్రెస్ ధరించి..

ఇక ది ట్రయల్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. థియేటర్స్ లోనూ సినిమాకు ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ది ట్రయల్ టీమ్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కు మంచి గుర్తింపు ఉంది. మూడు గంటలు ప్రేక్షకులను సీట్ లో కూర్చోబెట్టేలా కథ ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. ది ట్రయల్ సినిమా ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం నమ్మకంతో చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.