Tiger 3 actress Michelle Lee about The towel fight scene: స్కార్లెట్ జాన్సన్ మూవీ బ్లాక్ విడో, జానీ డెప్ మూవీ పైరెట్స్ ఆఫ్ కరేబియన్, బ్రాడ్ పిట్ మూవీ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ మూవీ వెనమ్ ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ తాజాగా ‘టైగర్ 3’ చిత్రంలో మరోసారి వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించడానికి రెడీ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘టైగర్ 3’ ట్రైలర్ లో కత్రినా, మిచెల్ లీ మధ్య ఉన్న టవల్ ఫైట్ సీన్ చూపించారు. ఆ ఒక షాట్ ఇంటర్నెట్‌లో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అయితే ఈ టవల్ ఫైట్ సీన్‌ని టర్కిష్‌లోని హామామ్‌లో చిత్రీకరించారట. టైగర్ 3’లో చూపించిన టవల్ ఫైట్‌లోని ఓ చిన్న సన్నివేశం నెట్టింట వైరల్ కావటంపై మిచెల్ ఆశ్చర్యపోవటం లేదని చెప్పుకొచ్చింది.
OnePlus Foldable: వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ కొనాలంటే ఇదే మంచి ఛాన్స్… ఏకంగా 11 వేలు డిస్కౌంట్.. ఎలా అంటే?
అందుకు కారణం.. కత్రినాతో మిచెల్ సదరు ఫైట్ సీన్‌ను ఎలా చేయాలి, ఎంత కొత్తగా చేస్తే ఆడియెన్స్‌కి అది కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. మిచెల్ లీ మాట్లాడుతూ ‘‘కత్రినాతో నేను చేసిన టవల్ ఫైట్‌కి సంబంధించిన చిన్న సన్నివేశం గురించి ఇలా అందరూ మాట్లాడుకోవటంపై నేనేమీ ఆశ్చర్యపోవటం లేదు, దీన్ని చిత్రీకరించే సమయంలో దీని గురించి అందరూ మాట్లాడుకునేంత డిఫరెంట్‌గా ఉంటుందని నమ్మానని అన్నారు. ఈ ఫైట్‌ను చిత్రీకరించటానికి ముందు నేను, కత్రినా కలిసి కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేశామని, ఆ ఫైట్, దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం అని అన్నారు. అందులో నటించేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో దీన్ని రూపొందించారన్న ఆమె కత్రినా కైఫ్ గొప్ప నటి, ఎంతో ప్రొఫెషనల్ పర్సన్, ఈ ఫైట్‌లో నటించటానికి తనెంతో కష్టపడింది, తనతో వర్క్ చేయటం ఎంతో సులువుగా అనిపించింది అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘మేం శరీరాలకు టవల్స్ చుట్టుకుని యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్నాం, ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయటానికి కచ్చితమైన యాక్షన్ కొరియోగ్రఫీ అవసరం దాన్ని కూడా ఎంతో అందంగా డిజైన్ చేశారని అన్నారు. ఇదొక ఛాలెంజింగ్‌గా అనిపించింది, ఒకరినొకరు గాయపరుచుకోకుండా ఓ కచ్చితమైన దూరాన్ని పాటిస్తూ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొనటం కూడా ఓ ఛాలెంజింగ్ విషయమే, ఇద్దరం ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండటం వల్ల ఎలాంటి గాయాలు కాలేదన్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 సినిమాను ఆదిత్య చోప్రా అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మించగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్బంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.