Site icon NTV Telugu

Siddharth 40: సిద్ధార్థ్ మూవీతో కంబ్యాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

Siddarth40

Siddarth40

Siddharth 40: తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ్. ఆ తరువాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాలలో నటించారు. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” మూవీలో ప్రత్యక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ‘సిద్ధార్థ్ 40’తో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు హీరో సిద్ధార్థ్. “నేను చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. శ్రీ గణేష్ చెప్పిన ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల లక్ష్యం.

Also Read: Darling: డార్లింగ్స్ కోసం స్టార్ హీరో

అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పని చేయడం ఆనందంగా ఉంది అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇది వరకే మొదలయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ రిలీజ్ చేసారు మేకర్స్. అది ఏమిటి అంటే “సుస్వాగతం” సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గ నటించిన దేవయాని ఈ మూవీలో ఒక ప్రత్యక పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. లాస్ట్ గ లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ కి తల్లిగా మెప్పించిన నటించిన దేవయాని మరి ఈ మూవీలో ఎటువంటి క్యారెక్టర్ చేస్తుందో చుడాలిసిందే. అలానే ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Exit mobile version