Site icon NTV Telugu

Kalki 2898 AD: విజయ్ ను అలా చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి టీమ్

Vijay Deverakonda Kalki

Vijay Deverakonda Kalki

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ షాక్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా రికార్డులు పరంపర సృష్టిస్తుంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడూ రోజుల్లో రూ.725 కోట్ల కలెక్షన్స్ సాధించి 1000కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ , SS రాజమౌళి , మృణాల్ ఠాకూర్ మరియు రామ్ గోపాల్ వర్మ నుండి అనేక ప్రత్యేక అతిధి పాత్రలు కూడా ఉన్నాయి.

Also Read: Re-release Trend: నాని సమంతల రొమాంటిక్ మూవీ.. రీ రిలీజ్ ఎప్పుడు అంటే..?

వీటిలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. విజయ్ క్యారెక్టర్‌కి ఇంటెన్సిటీ మరియు ఎమోషన్‌ల పర్ఫెక్ట్ సమ్మేళనాన్ని తీసుకువచ్చాడు. సినిమాలో, విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో. అతని పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ, అతని నటన శక్తివంతగాను మరియు గుర్తుండిపోయేలా ఉంది. అర్జునుడిగా విజయ్ అందించిన మేకోవర్ మరియు పవర్ ఫుల్ డైలాగ్‌లు “కల్కి 2898AD”లో అద్భుతమైన ఘట్టాలుగా నిలిచాయి. అతని సన్నివేశాలుకు ప్రేక్షకుల నుంచి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ అర్జునుడి పాత్రలో నటించిన హీరో విజయ్‌ దేవరకొండను పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. చేతిలో గాండీవం ఎక్కిపడుతూ బాణాన్ని అశ్వద్ధామ పైకి బలప్రయోగం చేసే పోస్టర్ సీన్ రివీల్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో కొనసాగుతుంది.

Exit mobile version