Site icon NTV Telugu

Bollywood : ఫ్లాప్ హీరొయిన్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆరడగుల సుందరి

Bollywood (1)

Bollywood (1)

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన క్రితిసనన్ ఆ తర్వాత 2014 లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత అదే సంవత్సరం ‘హీరోపంటి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, కృతికి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. ‘హీరోపంటి’ లో ఆమె నటన, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆమె నటించిన ‘దిల్వాలే’ సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.

Also Read : SIIMA 2025 : సైమా తెలుగు.. విజేతల లిస్ట్.. బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్న ఇద్దరు హీరోలు

హీరోపంటి’ తర్వాత, కృతి సనన్ నటించిన సినిమాల్లో ‘బరేలీ కి బర్ఫీ’, ‘లుకా ఛుప్పి’, ‘మిమి’ లాంటివి ఆమె కెరీర్ లో మైలుస్టోన్స్ గా నిలిచాయి. ముఖ్యంగా, ‘మిమి’ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ కు క్రిటిక్స్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ‘బరేలీ కి బర్ఫీ’ సినిమాకు కృతి బెస్ట్ యాక్ట్రెస్ ఫీమేల్ అవార్డు కూడా అందుకుంది. ‘మిమి’ లో ఆమె పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరగడం, మళ్ళీ తగ్గడం కృతి కమిట్ మెంట్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. మిమి’ సినిమా తర్వాత కృతి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. ఫిమేల్ మాల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’లో టబు, కరీనా కపూర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘ఆదిపురుష్’ సినిమాలో జానకి పాత్రలో ఆమె నటనకు, ఫ్యాన్స్ నుంచి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది. ఇటీవలే ఆమె నటించిన ‘తేరి బాతో మే ఐసా ఉల్జా జియా’ లో ఆమె పోషించిన సిఫ్రా రోబోట్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది. ప్రస్తుతం కృతి నటిస్తున్న ‘తేరీ ఇష్క్ మే’ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా. కాక్ టైల్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Exit mobile version