సంక్రాంతి కానుకగా ప్రభాస్ రాజాసాబ్, మెగా స్టార్ మన శంకరవరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. సంక్రాంతి అంటేనే సినిమాల పండగా ఈ నేపధ్ద్యంలో థియేటర్స్ అడ్జస్ట్ కాకున్నా కూడా పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేసారు మేకర్స్. కానీ ఎప్పుడు లేని విధంగా రాజాసాబ్ మినహాయించి అన్ని సినిమాలు మంచి టాక్ తెచుకున్నాయి.
Also Read : Nidhi Agerwal : పవన్ కళ్యాణ్ భారత ప్రధానమంత్రి అవుతారు
అయితే వీటిలో మన శంకర వరప్రసాద్ వసూళ్లు పరంగా విన్నర్ గా నిలిచింది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి కంటెంట్ పరంగా విన్నర్ గా నిలిచింది. ఇక ఈ ఐదు సినిమాలలో దర్శకులలో సంక్రాంతి విన్నింగ్ డైరెక్టర్ అంటే రామ్ అబ్బరాజు అని మరో మాటలేకుండా చెప్పొచ్చు. చిన్న సినిమా అయిన నారి నారి నడుమ మురారి కథ పరంగాను కామెడీ పరంగాను ఆడియన్స్ నుండి కాకుండా క్రిటిక్స్ నుండి కూడా మన్ననలు పొందాడు. సింపుల్ కథలో ఎటుంవంటి మసాలాలు యాడ్ చేయకుండా తెరకెక్కించిన విధానం మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. చిన్న బడ్జెట్ లో సినిమాలు చేసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చే దర్శకుడిగా రామ్ అబ్బరాజుకు మంచి డిమాండ్ ఏర్పడింది. మరి రామ్ అబ్బరాజు నెక్ట్స్ సినిమా ఏ బిగ్ బ్యానర్ లో ఏ స్టార్ హీరోతో ఉంటుందో చూడాలి.
