Site icon NTV Telugu

SSMB 28: మహేష్ ఫ్యాన్స్ సిద్ధం కండి.. రచ్చ చేసే టైమ్ వచ్చేసింది

Trivikram

Trivikram

SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన క్షణం రానే వచ్చింది. సర్కారువారి పాట చిత్రం తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం విదితమే. ఎప్పుడో పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది..? ఈ సినిమా గురించిన అప్డేట్ ను ఎప్పుడు ఇస్తారు అంటూ మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక అభిమానుల ఆతృతను అర్థం చేసుకున్న మేకర్స్ ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను షేర్ చేశారు.

ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. SSMB 28 వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ అభిమానులు ఈ రిలీజ్ డేట్ కు రచ్చ చేస్తున్నారు. హమ్మయ్య ఎట్టకేలకు ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పుకొంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఇంకా సినిమా సెట్స్ మీదకే వెళ్లకుండా రిలీజ్ డేట్ ఎలా ప్రకటిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అంటే మార్చి లో షూటింగ్ అయిపోతుంది. ఈ షూట్ అవ్వగానే మహేష్, రాజమౌళి సెట్ లో అడుగుపెడతాడు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇయర్ గా నిలిచిపోతుందని చెప్పుకొస్తున్నారు.

Exit mobile version