సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు అనే మాట గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజా సాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. ఇటీవల మారుతి మాట్లాడుతూ… ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా రానుంది, కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అన్నారు. ఆ మూవీ తర్వాత రాజా సాబ్ అప్డేట్లు వస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇయర్ ఎండింగ్‌లో రాజా సాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
లేటెస్ట్ గా మారుతీ “అందరూ కోరుకున్న ఒక మంచి డేట్ కే సినిమా వస్తుంది. ఈ సీజన్ లో వస్తే బాగుంటుందని అందరూ అనుకున్న సీజన్ లోనే సినిమా వస్తుంద”నిచెప్పాడు మారుతీ. ఈ సమయంలో ది రాజాసాబ్ సినిమా 2025 సంక్రాంతి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసారు. ఇదే మాటని నిజం చేసేలా ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ… “రాబోయే రోజుల్లో మా బ్యానర్ నుంచి ఈ ఇయర్ ఆరు సినిమాలు రాబోతున్నాయి. ఈగల్, శర్వానంద్ 35, శ్రీవిష్ణు స్వాగ్, మిస్టర్ బచ్చన్… ఈ సినిమాలతో పాటు ది రాజ్ సాబ్ సినిమా కూడా ఉంటుంది” అని చెప్పాడు. ఈ లెక్కన ది రాజా సాబ్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ సంక్రాంతి సీజన్ కి రిలీజయ్యే అవకాశం ఉంది. దాదాపు 2025 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూనే ది రాజాసాబ్ సినిమా రిలీజ్ అవనుంది.