రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించారు.
Also Read :The Raja Saab Movie Review : ‘ది రాజా సాబ్’ రివ్యూ..ప్రభాస్ హిట్టు కొట్టాడా? లేదా?
అయితే ఈ సినిమాలో వీరు ముగ్గురే కాదు, మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటించారు. వారి వివరాలు మీకోసం అందిస్తున్నాం. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ నానమ్మ పాత్రలో జరీనా వాహబ్ నటించింది. ఆమెకు ఇది సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, ఆమె ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు సహా హిందీలో ఎన్నో సినిమాలు చేసింది. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్ స్నేహితురాలి పాత్రలో కన్నడ హీరోయిన్ మనీషా కందుకూర్ నటించింది; ఆమె ఈ మధ్యకాలంలోనే తెలుగులో పలు సినిమాలు చేస్తోంది. ఇక మరో స్నేహితురాలిగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన సుల్తానా నటించింది.
Also Read :The Raja Saab Part 2: రాజా సాబ్ 2కి టైటిల్ ఇదే!
అలాగే వీరితో పాటు ప్రభాస్ నానమ్మ పాత్ర అయిన గంగమ్మకు యంగ్ వర్షన్‌లో తమిళ సినీ హీరోయిన్ అమ్ము అభిరామి నటించింది. ఆమె తెలుగులో కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. ఇక అలాగే ఈ సినిమాలో అతిథి పాత్రలో తెలుగు అమ్మాయి, ప్రస్తుతం తమిళంలో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న ఆనంది కనిపించింది. అలా మొత్తం మీద ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కాదు, మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు నటించారన్నమాట.
