NTV Telugu Site icon

The Raja Saab: ఆ కటౌట్ కి ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయాల్సిందేలే…

The Raja Saab

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ గా ఇన్ని రోజులు యాక్షన్ బాటలో నడిచాడు ప్రభాస్. డైనోసర్ ప్రభాస్ ని డార్లింగ్ ప్రభాస్ గా చూసి చాలా రోజులే అయ్యింది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి కూల్ క్యారెక్టర్ ఇప్పట్లో ఎక్స్పెట్ చేయలేమేమో అనుకుంటున్న సమయంలో మారుతీ రేస్ లోకి వచ్చాడు. వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను… డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ ని గుర్తు చేస్తాను అంటూ మారుతీ ప్రభాస్ ని “ది రాజా సాబ్” చేసాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. టైటిల్ రివీల్ చేస్తూ సంక్రాంతి పండగ రోజున రిలీజ్ చేసిన ది రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లుంగీ కట్టుకోని చాలా ఎనర్జీతో ఉన్న ప్రభాస్ ని మారుతీ పరిచయం చేసాడు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ పోస్టర్ ని ఇంత లైవ్లీగా చూడలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ కటౌట్ ని ఏర్పాటు చేసింది. ప్రభాస్ అడ్డా అయిన భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్ పెట్టి ది రాజా సాబ్ ఫస్ట్ లుక్ ని అభిమానుల మధ్య రివీల్ చేసారు మేకర్స్. దర్శకుడు మారుతీ, ప్రొడ్యూసర్ కూడా ఈ ఫస్ట్ లుక్ రివీల్ కి వచ్చి ఫ్యాన్స్ ని మరింత జోష్ లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.