The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!

The Paradise

The Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన టోటల్ షూటింగ్ ఈ రోజుతో పూర్తయినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ సినిమా షూటింగ్‌కి మేకర్స్ నేటితో గుడ్‌బై చెప్పి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఫస్టాఫ్‌కు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక సెకండాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎడిటింగ్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి కీలక విభాగాల్లో టీమ్స్ ఏకకాలంలో పనిచేస్తున్నట్లు సమాచారం. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ఎలాంటి విరామం లేకుండా పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తుండటంతో ఆడియోతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తుండగా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనివిందు చేయనుంది. ఈ మూవీని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి ఒక రోజు ముందుగా అంటే వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ కూడా మరింత జోరందుకునే అవకాశం ఉంది. షూటింగ్ పూర్తవడంతో నాని అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి, సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.