NTV Telugu Site icon

The OG: బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ ఉన్నావ్ మావా…

The Og

The Og

డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడు అనే థాట్స్ తోనే అంచనాలు పెంచేసుకుంటున్నారు మెగా ఫాన్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా, ముంబై బ్యాక్ డ్రాప్, పవన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి ఎలిమెంట్స్ ని ఒక్కొకటిగా రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి OG సినిమాకి పంజా మూవీ వైబ్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి అప్డేట్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఒక క్విక్ షెడ్యూల్ కి పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఆ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు ట్వీట్ చేశారు. డ్రామా, యాక్షన్, లవ్, మెలోడీ లాంటి ఎమోషన్స్ ఉన్న పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసాం అని మేకర్స్ ట్వీట్ చేశారు.

ఈ సంధర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ పవన్ వాకింగ్ స్టిల్ ఒకటి రిలీజ్ చేసింది. అందులో బ్లూ షర్ట్, బ్లాక్ గాగుల్స్, లైట్ బియర్డ్ తో పవన్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తున్నాడు కానీ ఏ సినిమాపై లేనన్ని అంచనాలు, ఏ సినిమాపై జరగనంత ట్రేడ్ ‘OG’పై జరుగుతోంది. ప్రతి షెడ్యూల్ కి ఒక అప్డేట్ ఇస్తున్న మేకర్స్, ఇదే జోష్ ని రిలీజ్ వరకూ మైంటైన్ చెయ్యగలిగితే OG సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్యూర్ ఫాన్ స్టఫ్ ని సుజిత్ ఇవ్వగలిగితే చాలు ఇప్పుడున్న హైప్ కి ‘OG’ నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తుంది.