NTV Telugu Site icon

Masthan Sai : మస్తాన్ సాయి కేస్ లో ఎంట్రీ ఇచ్చిన నార్కోటిక్స్ పోలీసులు

Masthan Sai

Masthan Sai

లావణ్య, మాస్తాన్ సాయి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు హార్డ్ డిస్క్, యువతుల వీడీయోలు చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ టర్న్ తీసుకుంది.  మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీల పై విచారణ చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పలువురు యువతులను పార్టీ అని పిలిచి డ్రగ్స్ ఇచ్చి వారికి తెలియకుండా వీడియోలు రికార్డు చేసాడు మస్తాన్ సాయి. డ్రగ్స్ పార్టీల వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టి రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే నగ్న వీడియోలు చిత్రీకరించారు అని మస్తాన్ సాయి తో పాటు ఖాజ ను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు. ఖాజా కు 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవంటే..?

తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం వీడియోలు వైరల్ గా మారడంతో రంగంలోకి  దిగారు నార్కోటిక్స్ పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో డ్రగ్స్ వాడకం వీడియోలు క్షుణ్ణంగా పరిశీలించి డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు నార్కోటిక్స్ పోలీసులు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్య పై డ్రగ్స్ కేసులు ఉన్నట్టు తేలింది. అసలు ఈ డ్రగ్స్ ఇంత భారీ మొత్తంలో మస్తాన్ సాయి ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఎంత మంది ఈ పార్టీల్లో పాల్గొన్నారు అనే అంశాల పై ఫొకస్ చేసి ఒక్కొక్కరిని విచారించి డ్రగ్స్ గుట్టు రట్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు.