NTV Telugu Site icon

Pan India: సెప్టెంబర్ నెల మొదలు…. చివర మనదే!

Sep

Sep

Telugu Cinema: తెలుగు సినిమాలు ఈ యేడాది పాన్ ఇండియా స్థాయిలోనే కాదు… పాన్ వరల్డ్ లెవల్ లో తమ సత్తా చాటబోతున్నాయి. తొలిసారి భారతీయ చిత్రం అందునా తెలుగులో తెరకెక్కిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆస్కార్ వేదికపై తన జెండా పాతింది. అంతే కాదు… ఈ యేడాది తెలుగులో రూపుదిద్దుకుంటున్న దాదాపు 30 సినిమాలు నాలుగు లేదా ఐదు భారతీయ భాషల్లో విడుదల అవుతూ పాన్ ఇండియా కేటగిరిలో జయకేతనం ఎగురవేయడానికి రెడీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ సరికొత్త విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోంది. సో… సెప్టెంబర్ 1న మన తెలుగు సినిమా ‘ఖుషీ’ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంటే… అదే సెప్టెంబర్ నెలాఖరులో అంటే 28న మరో తెలుగు పాన్ ఇండియా సినిమా సంచలనం సృష్టించబోతోంది. అదే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ మూవీ! దీన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సో… సెప్టెంబర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వీకెండ్స్ లో మన తెలుగు పాన్ ఇండియా మూవీసే దేశవ్యాప్తంగా సందడి చేయబోతున్నాయి. మరి పాన్ ఇండియా సక్సెస్ విషయంలో కాస్తంత వెనకబడ్డ ఈ ఇద్దరు క్రేజీ హీరోలు తమ చిత్రాలతో పొజిషన్ ను సుస్థిరం చేసుకుంటారేమో చూడాలి.

Show comments