NTV Telugu Site icon

Marvel Cinematic Universe: నష్టాల్లోకి ‘ది మార్వెల్స్’… అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU పతనం

The Marvels

The Marvels

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్… వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, థార్, స్పైడర్ మాన్, బ్లాక్ పాంథర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సి, హల్క్, బ్లాక్ విడో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సూపర్ హీరోస్ ని ఒక దగ్గరికి చేర్చింది MCU. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి గోల్డెన్ ఫేజ్ అంటే ఫేజ్ 3 అనే చెప్పాలి. ది ఇన్ఫినిటీ సాగా పేరుతో బయటకి వచ్చిన ఫేజ్ 3లో కెప్టెన్ అమెరికా సివిల్ వార్, డాక్టర్ స్ట్రేంజ్, థార్, బ్లాక్ పాంథర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2, స్పైడర్ మాన్ హోమ్ కమింగ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, కెప్టెన్ మార్వెల్, అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీతో ఆల్మోస్ట్ అందరు సూపర్ హీరోల కథలకి థానోస్ ని చంపడంతో పర్ఫెక్ట్ క్లైమాక్స్ వచ్చేసింది. అవతార్ 2 వచ్చే వరకూ వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్ గా ఎండ్ గేమ్ నిలిచింది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా దాదాపు ఇదే లాస్ట్ హిట్. 2019 ఏప్రిల్ 26న రిలీజ్ ఈ మూవీ తర్వాత అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి క్లీన్ హిట్ టాక్ తెచ్చుకున్న మార్వెల్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఫేజ్ 4 కంప్లీట్ అయ్యింది, ఫేజ్ 5 మిడ్ కి వచ్చేసింది కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మాత్రం పూర్వవైభవాన్ని సొంతం చేసుకోలేకపోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ‘ది మార్వెల్స్’ మూవీ నష్టాల వైపు వెళ్తుంది, కలెక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి అంటే మార్వెల్ సినిమాలపై ఆడియన్స్ లో ఎంతగా ఆసక్తి తగ్గుతుందో అర్ధం చేసుకోవచ్చు. పైగా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రైక్ నడుస్తోంది, ఈ కారణంగా సినిమాలని ప్రమోట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇక ఫేజ్ 5లో ఇంకా డెడ్ పూల్ 3, కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో డెడ్ పూల్ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయి ఇది కూడా ఫెయిల్ అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ఫేజ్ మొత్తం ఫ్లాప్ అవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. గత 10 ఏళ్లుగా ఆడియన్స్ కి బాగా అలవాటైన ఆర్టిస్టులు సడన్ గా కనిపించకపోవడం, మార్వెల్ సినిమాల్లో కథలు ఎలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ లేకుండా రెగ్యులర్ గా అయిపోతూ ఉండడం ఆడియన్స్ ని దూరం చేస్తున్నాయి. మార్వెల్ నుంచి ఇకపై కూడా ఇలాంటి సినిమాలే వస్తే అతి త్వరలోనే ఈ యూనివర్స్ కి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది.

Show comments