Mahesh Babu : మహేశ్ బాబు – బుచ్చి బాబు.. ఛాన్స్ లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సాన.. మహేశ్ బాబుకు ఒక కథను వినిపించారని, వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ బ్యానర్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేయడానికి ఒక ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
మరోవైపు, బుచ్చిబాబు – మహేశ్ బాబు కలయికపై సూపర్ స్టార్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాజమౌళి సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని, నెక్స్ట్ లైన్-అప్ కూడా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు మార్క్ రా అండ్ రస్టిక్ ఎమోషనల్ కథలు మహేశ్ బాబు ఇమేజ్కు సెట్ కాకపోవచ్చని, పైగా వారణాసి లాంటి విజువల్ వండర్ తర్వాత మళ్లీ అంతకంటే భారీ కాన్సెప్ట్ ఉన్న దర్శకుడితోనే మహేశ్ ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ కాంబో రూమర్లపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘వారణాసి’ పూర్తయిన తర్వాతే మహేశ్ బాబు తన 29వ చిత్రంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..