NTV Telugu Site icon

Bhagavanth Kesari: బ్రో.. బాలయ్య డైలాగ్స్ అంటే .. ఆ మాత్రం ఉండాలి

Bala

Bala

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ను అభిమానులకు అందించారు. భగవంత్ కేసరి షూటింగ్ పూర్తీ అయ్యిందని మేకింగ్ వీడియో ద్వారా తెలిపారు. ఇక ఈ వీడియోలో అనిల్ రావిపూడి సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు.

Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..

సినిమా కోసం ఎన్ని సెట్స్ వేసింది.. బాలయ్య లుక్.. కాజల్ లుక్ అన్ని ఇందులో చూపించారు. ఇక అంతేకాకుండా బాలయ్య డైలాగ్స్ కూడా రెండు వినిపించారు. బాలయ్య సినిమా అంటే.. ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయో అందరికి తెల్సిందే. ఇందులో కూడా అలాంటి డైలాగ్స్ ఉన్నాయని అనిల్ మచ్చుకు ఒక రెండు డైలాగ్స్ వినిపించాడు. “కలిసి మాట్లాడతాను అన్నాకదా.. ఇంతలోనే మందిని పంపాలా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే ” అనే డైలాగ్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. ఇక చివర్లో ” బ్రో .. ఐ డోంట్ కేర్ ” అని చెప్పడం ఆకట్టుకుంటుంది. బ్రో.. బాలయ్య డైలాగ్స్ అంటే .. ఆ మాత్రం ఉండాలి అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో బాలయ్య – అనిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Show comments